పుట్టినరోజు వేడుకల అనంతరం ఆత్మహత్య
- January 03, 2018
దుబాయ్:ఆసియాకి చెందిన 28 ఏళ్ళ వ్యక్తి ఒకరు, తన రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్త సంవత్సరం తొలి రోజున, అదీ తన పుట్టినరోజు వేడుకల్ని అదే రోజు జరుపుకున్న అనంతరం ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలచివేస్తోంది. 1990 జనవరి 1న ఆ వ్యక్తి జన్మించాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా ఖాదెమ్ బిన్ సర్రోర్ మాట్లాడుతూ, జనవరి 1న తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో తమకు సమాచారం అందిందనీ, వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళగా ఓ యువకుడు మృతి చెంది కన్పించాడని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా చితికిపోయాడని ఆయన సన్నిహితులు పోలీసులకు తెలిపారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







