భారత్‌లో ఒమనీలకు హెచ్చరిక

- January 03, 2018 , by Maagulf
భారత్‌లో ఒమనీలకు హెచ్చరిక

మస్కట్‌: ముంబైలోని ఒమనీ కాన్సులేట్‌, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై సహా, మహారాష్ట్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమనీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ కాన్సులేట్‌ హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో తమ పౌరులు స్పందించడానికి 0091222876037/38 నెంబర్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు కాన్సులేట్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పూణే సమీపంలోని భిమా కోరెగాన్‌ గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ళదాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరింతగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశం ఉన్నందున ఒమన్‌ పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కాన్సులేట్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com