ఇజ్రాయెల్‌లో 'బ్రహ్మాస్త్ర' సినిమా
- January 03, 2018
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో అమితాబ్‌బచ్చన్ నటించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇజ్రాయెల్‌లో మొదలయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు కరణ్. ''బ్రహ్మాస్త్ర' ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది''అని ట్వీటారు. ఇందులో రణ్‌బీర్ అతీంద్రియ శక్తులున్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి భాగం ఆగస్టు 2019కి ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







