యు.ఏ.ఈ:ఎటిసలాట్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై నో వ్యాట్
- January 03, 2018
యు.ఏ.ఈ:ఎటిసలాట్ ప్రీపెయిడ్ రీఛార్స్ కార్డులపై వ్యాట్ ప్రభావం ఏమీ లేదని సంస్థ పేర్కొంది. ఎటిసలాట్ డిస్ట్రిబ్యూటర్లు, వినియోగదారుల నుంచి అదనంగా ఎలాంటి పన్నులు లేదా ఛార్జీలను వ్యాట్ పేరుతో వసూలు చేయరాదని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో పేర్కొంది. 5 శాతం వ్యాట్, జనవరి 1 నుంచి అమల్లోకి రావడంతో వినియోగదారుల్లో కొంత అయోమయం నెలకొంది. 30 దిర్హామ్‌లు, 55 దిర్హామ్‌లు, 110 దిర్హామ్‌లు, 210 దిర్హామ్‌లు, 525 దిర్హామ్‌ల కార్డుల్ని వినియోగదారులకు ఎటిసలాట్ అందుబాటులో ఉంచింది. ప్రీపెయిడ్ కార్డు వినియోగదారులు ఎలాంటి వ్యాట్ చెల్లించాల్సిన పనిలేదనీ, వాస్తవ వినియోగంపైనే వ్యాట్ ఉంటుందని ఎటిసలాట్ స్పష్టం చేసింది. యూఏఈ ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ సూచనల మేరకు 5 శాతం వ్యాట్‌ని జనవరి 1 నుంచి వసూలు చేయనున్నట్లు, అది కూడా అప్లికబుల్ ప్రాడక్ట్స్ మీద మాత్రమేనని గతంలోనే ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







