డిఎస్‌ఎఫ్‌ ఫ్రైడే సేల్‌: 85 శాతం డిస్కౌంట్‌

- January 04, 2018 , by Maagulf
డిఎస్‌ఎఫ్‌ ఫ్రైడే సేల్‌: 85 శాతం డిస్కౌంట్‌

ఈ వీకెండ్‌లో దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం సందర్బంగా 85 శాతం ఆఫర్స్‌ వినియోగదారుల్ని విశేషంగా ఎట్రాక్ట్‌ చేయనున్నాయి. ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ నైన్‌ వెస్ట్‌ - ఐబిఎన్‌ బత్తుతా మాల్‌లో రేపు (అంటే శుక్రవారం) 85 శాతం ఆఫర్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకోనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో ప్రతి శుక్రవారం అదనంగా అత్యద్భుతమైన ఆఫర్స్‌ ఉంటాయి. జనవరి 28 వరకు దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. 1 మిలియన్‌ దిర్హామ్‌ విలువైన బహుమతుల్ని గెల్చుకునే రాఫెల్స్‌ ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ మరో ప్రత్యేకత. తదుపరి 12వ తేదీన, 19వ తేదీన, 26వ తేదీన శుక్రవారాల సందర్భంగా స్పెషల్‌ డిస్కౌంట్స్‌ని వినియోగదారుల కోసం ప్రకటిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com