క్యాన్సర్‌ పీడిత చిన్నారి కల నెరవేరిన వేళ

- January 04, 2018 , by Maagulf
క్యాన్సర్‌ పీడిత చిన్నారి కల నెరవేరిన వేళ

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీసులు, క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి కలని నెరవేర్చారు. ఒమన్‌రాయల్‌ హాస్పిటల్‌లో అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా చికిత్స పొందుతున్న యౌంట్‌ అల్‌ హవారి అనే ఓ చిన్నారి, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ యూనిఫామ్‌ ధరించి, అధికారులతో కలిసి పెట్రోల్‌ వాహనంలో వెళ్ళాడు. పోలీస్‌గా విధులు నిర్వహించడమెలాగో తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఆన్‌ లైన్‌ ద్వారా రాయల్‌ హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. తన కల నెరవేరినందుకు చిన్నారి చాలా ఆనందంగా ఉన్నాడని రాయల్‌ హాస్పిటల్‌ పేర్కొంది. ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీసులకు హాస్పిటల్‌ కృతజ్ఞతలు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com