తెలంగాణ వాహనాల పై కేరళ ప్రభుత్వం భారీ ట్యాక్స్
- January 05, 2018
తిరువనంతపురం : తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో అడుగుపెట్టే వాహనాలపై కేరళ ప్రభుత్వం భారీగా రోడ్ ట్యాక్స్ విధించింది. కేరళ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడంతో.. తామూ ఆ పని చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్‌పై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పదాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందాలను నీరుగార్చిందని కేరళ పేర్కొంది. అంతర్రాష్ట్ర రోడ్డు ట్యాక్స్‌లపై కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒప్పందాలున్నాయి. ఈ ఒప్పందాలను కొనసాగించాలని కేరళ ప్రభుత్వం చేసిన సూచనన తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చే స్టేజ్ కారియర్లపై కేరళ రోడ్డు పన్నును విధించింది.
అయ్యప్పలపై పన్నుపోటు
ప్రస్తుతం కేరళలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ స్థాయిలో భక్తులు కేరళ వెళ్తున్నారు. వేల కొద్దీ తెలంగాణ వాహనాలు కేరళలో ప్రయాణిస్తున్నాయి. కొత్త ట్యాక్స్ ప్రకారం.. 49 సీట్లున్న స్టేజ్ కారియర్.. కేరళకు రూ. 15 వేలు పన్ను కట్టాలి. కేరళ ప్రభుత్వం ఒక్క సీటుకు రూ.300 నుంచి రూ. 400 వరకూ ఛార్జ్ చేస్తోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!