రవితేజ మరో సినిమా ప్రారంభం
- January 05, 2018
బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక రీసెంట్ గా టచ్ చేసి చూడు అనే సినిమా షూటింగ్ పూర్తి చేసిన మాస్ రాజా తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలోను ఫుల్ స్పీడ్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్ధాం వంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణతో మూవీ మొదలు పెట్టాడు రవితేజ. ఈ రోజు నుండే మూవీ షూటింగ్ ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుండగా, ఈ మూవీకి నేల టికెట్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రవితేజ సరసన మాళవిక శర్మని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక నీ కోసం సినిమాతో సోలో హీరోగా రవితేజని ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తుండగా, ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని ఫిలిం నగర్ సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







