గజల్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
- January 05, 2018
హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రాసీక్యూషన్ న్యాయవాది చెప్పడంతో ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 354, 354 ఏ, 509 సెక్షన్లు నమోదు చేశారు. అనంతరం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది.
అదే సమయంలో తనపై అన్యాయంగా కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా సీడీలను ఎఫ్ఎస్ఎల్కు ఎలా పంపిస్తారనంటూ ప్రశ్నించింది. ఏ2 అయిన పార్వతీ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా నిర్లక్ష్యంగా ఎలా సమాధానం చెబుతారని నిలదీసింది. సేవ్ టెంపుల్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల (జనవరి) 2న గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







