పద్మావతి కాస్తా 'పద్మావత్' అయిందేంటి!
- January 05, 2018
దీపికా- షాహిద్‌కపూర్- రణవీర్‌సింగ్ కాంబినేషన్‌లో రానున్న మూవీ 'పద్మావతి'. ఏ ముహూర్తాన షూటింగ్ మొదలైందోగానీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ మూవీ సృష్టించిన రభస అంతాఇంతా కాదు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఓకే అయినట్టు టాక్. ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. కొన్ని సినిమాలు డేట్స్ ముందుగా ప్రకటించడంతో ఫిబ్రవరికి వెళ్లింది.
ఇటీవల సెన్సార్‌కు వెళ్లిన ఈ ఫిల్మ్‌కి భారీగానే కట్స్ పడడంతో సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేసింది. అలాగే టైటిల్ కూడా మార్చింది. పద్మావతి కాస్తా పద్మావత్ అయ్యింది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాది డిసెంబర్ ఒకటిన విడుదల కావాల్సి వుండగా, ఈ క్రమంలో వివాదాలు చుట్టుముట్టాయి. మేకర్స్‌పై రాజ్‌పుత్ వర్గీయులు మండిపడడం, నటీనటులకు బెదిరింపు లు రావడం జరిగిపోయిన విషయం తెల్సిందే! ఇప్పటికైనా పద్మావత్.. ఆటంకాలు లేకుండా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







