కువైట్ లో సౌదీ దిగుమతులు నిషేధం.!

- January 05, 2018 , by Maagulf
కువైట్ లో సౌదీ దిగుమతులు నిషేధం.!

కువైట్ : కోడిమాంసం అంటే కువైటీయులు గతంలో లొట్టలు వేసేవారు..ప్రస్తుతం చికెన్ అంటే ఛీత్కరించుకొంటున్నారు. సౌదీఅరేబియా నుంచి దిగుమతవుతున్న కోళ్లపై కువైట్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. సౌదీలోని కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని నిరూపితమవడంతో  కువైట్ ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీఅరేబియాలో హెచ్8ఎన్8 వైరస్ వ్యాప్తి చెందుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనిమ్మల్ హెల్త్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని కువైట్  పబ్లిక్ హెల్త్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ అధికార ప్రతినిధి షాకీర్ అవధ్ గురువారం వెల్లడించారు. గత నెల డిసెంబర్ 25న ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎప్పుడు  నిషేధాన్ని ఎత్తివేయనున్నారనే విషయం ఈ ప్రకటనలో  పేర్కొనలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com