ప్రధాని మోడీని కలిసిన ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు
- January 05, 2018
విభజన చట్టంలోని అంశాలను వేగంగా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరారు ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు.. ముఖ్యంగా రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ స్థానల పెంపు లాంటి అంశాలను ప్రధాని ముందు ఉంచింది ఎంపీల బృందం..
2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటు 7500 కోట్ల రూపాయలకు గాను, 3979 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఇఏపీ ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులు ఇప్పించాలని కోరారు. మరోవైపు ఏపీ భవన్ విభజన వేగవంతం చేయాలని కోరారు..
ఇద్దరు మంత్రులు, 14 మంది ఎంపీలు ప్రధాని మోడిని కలిసి.. 16 పేజీల మెమోరాండాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. వెంటనే ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శికి మెమోరాండాం ప్రతిని ఇచ్చి... ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ముందు ప్రధాని స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







