అరేబియన్ గల్ఫ్ కప్ ను రెండోసారి గెలిచిన ఒమన్ ... స్టేడియంలో అడ్డంకులు కూలిపోయాయి

- January 06, 2018 , by Maagulf
అరేబియన్ గల్ఫ్ కప్ ను రెండోసారి గెలిచిన ఒమన్ ... స్టేడియంలో అడ్డంకులు కూలిపోయాయి

కువైట్ : స్థానిక జబెర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం ఫుట్ బాల్  ఫైనల్ పోటీ హోరాహోరీగా జరిగింది. పెనాల్టీ కిక్ ద్వారా యుఎఇను ఓడించి 23 వ అరేబియా గల్ఫ్ సాకర్ కప్ ను ఒమన్ గెలుచుకుంది. ఒమన్ జట్టు ​​ఐదు గోల్స్ వేయగా యూఏఈ  నాలుగు గోల్స్  స్కోరు మాత్రమే చేశారు. ఇది రెండవ సారి ఒమన్ కప్ గెలుచుకుంది.23 వ అరేబియా గల్ఫ్ కప్ టోర్నీ ముగిసిన అనంతరం ఒక వేడుక జరిగింది. మరియు గౌరవనీయ అమిర్ యొక్క ప్రతినిధి  అమీర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరగనున్న అరబ్ గల్ఫ్ కప్ తుది పోటీలలో  యూఏఈ  క్రీడాకారులకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ ఫుట్బాల్ జట్టు కువైట్ క్రీడాభిమానులకు  ఉచిత టికెట్లను అందచేశారు. దాంతో అత్యధికంగా హాజరైన అభిమానులు అతిగా ఉత్సాహంగా ప్రవర్తించడంతో స్టేడియంలో పలుచోట్ల అడ్డంకులు కూలిపోవడం గమనార్హం.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com