ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన సౌదీ ప్రభుత్వం..

- January 06, 2018 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన  సౌదీ ప్రభుత్వం..

సౌదీఅరేబియా : ' ఒక కీడు .... మరో మేలుకె అని మన తెలుగు రాష్ట్రాలలో అంటారు..సౌదీలో అది నిజమైంది. విలువ ఆధారిత పన్ను ( వేట్ )అమల్లోకి వచ్చిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచింది   ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ' మనసున్న మారాజుగా ' పేరు తెచ్చుకొన్న సౌదీ రాజు సానుకూలంగా స్పందించారు..పెరిగిన పన్ను విషయమై భయపడకండి..మీ అందరికి  జీతాలు పెంచుతున్నామని ప్రకటించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం వెయ్యి రియాళ్ళు పెంచుతున్నామన్నారు. ముఖ్యంగా దక్షిణ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు 5  వేల రియాళ్లను పెంచారు. ఈ పెరిగిన జీతం జనవరి 1 వ తేదీ నుంచే అమలోకి వస్తుందని ఆయన తెలిపారు. పాపం ...అరకొర జీతం తీసుకొనే కొందరు  ప్రయివేట్ ఉద్యోగులు తమనేవారు ఆదుకొంటారన్నట్లుగా బిక్క మొహలతో ఎదురుచూస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com