గజల్ శ్రీనివాస్‌పై చంద్రబాబు సర్కారు వేటు
- January 06, 2018
గజల్ శ్రీనివాస్ అంటే తెలియని వారంటూ వుండరు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన వ్యక్తిపై ప్రస్తుతం లైంగిక ఆరోపణలు వచ్చాయి. పోలీసులు పక్కా ఆధారాలు వుండటంతో జైలుకు పంపారు. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ ప్రచారకర్తగా వ్యవహరించిన సంస్థలన్నీ ఆయన్ని తొలగించే పనిలో పడ్డాయి. తాజాగా తన వద్ద పనిచేస్తున్న యువతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించిన శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది.
శ్రీనివాస్ వీడియోలు లీక్ కావడంతో ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం శ్రీనివాస్‌కు షాకిచ్చింది. గజల్ శ్రీనివాస్‌ను ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగిస్తున్నట్టు చంద్రబాబు సర్కారు ప్రకటించింది. గజల్ శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలు, కనిపిస్తున్న సాక్ష్యాల నేపథ్యంలో, ఈ పదవికి ఆయన అర్హుడు కాదన్న నిర్ణయం తీసుకుంది.
కాగా, ఓ కంప్యూటర్ ఆపరేటర్, రేడియో జాకీ, మూడు నెలల నుంచి పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి. అంత పక్కాకా సీసీ కెమెరాలను అమర్చి గజల్ శ్రీనివాస్ బండారాన్ని బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు మీడియాకు చిక్కడంతో గజల్ శ్రీనివాస్ గలీజు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!