'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ విడుదల
- January 07, 2018
హైదరాబాద్: 'ధనం మూలం ఇదం జగత్.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం' అంటున్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన నటిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. సరదా సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు.
పూజారులుగా ఇక్కడ జీవితం సాగిస్తున్న బ్రహ్మనందం, ఆయన బృందంతో విష్ణు అమెరికాకు వెళ్దామని, అక్కడైతే డాలర్లు సంపాదించొచ్చని చెబుతారు. దీంతో అందరూ కలిసి అమెరికా వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొనే సంఘటనలను వినోదబరితంగా టీజర్లో చూపించారు. చివర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.
జి నాగేశ్వరరెడ్డి 'ఆచారి అమెరికా యాత్ర'కు దర్శకత్వం వహించారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. పద్మజా పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనూప్ సింగ్ ఠాకూర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







