కేసీఆర్ కు 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో
- January 07, 2018
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉప్పునిప్పుగా ఉన్న పవన్‌కల్యాణ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న ప్రగతి భవన్లో కలవడం అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు పవన్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా ప్రత్యేక షో వేస్తారంట. ఈ సినిమా చూడడానికి ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ శనివారం (జనవరి-6) తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ రామ్మోహన్‌రావును తెలంగాణ సచివాలయంలో కలిశారు. ఈ నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలవుతోంది. మంత్రి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ స్పెషల్ షోకు సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారని తెలిసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అజ్ఞాతవాసి తీస్తున్న సినిమాలో కీర్తి సురేశ్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







