జూన్ 29న సంజూ బయోపిక్..
- January 07, 2018
సంజయ్ దత్ బయోపిక్ అనుకున్న తేదీకి రావడం లేదు. షూటింగ్ డిలే కారణంగా ఈ చిత్రం మూడు నెలలు ఆలస్యంగా ఆడియెన్స్ ముందుకు రాబోతుందట.
ఈ ఏడాది బాలీవుడ్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి సంజయ్ దత్ బయోపిక్ 'సంజు'. వారసత్వంగా సినీరంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత జైలు బాట పట్టడం వంటి అనేక మలుపులు తిరిగిన సంజయ్ దత్ జీవిత కథతో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ బయోపిక్‌లో సంజయ్ దత్‌గా ఆన్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాడు బాలీవుడ్ లవర్ బోయ్ రణ్‌బీర్ కపూర్. విధు వినోద్ చోప్రా నిర్మిస్తోన్న ఈ సినిమాని మొదట మార్చి 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే షూటింగ్ డిలే కారణంగా ఈ సినిమాని మూడు నెలలు ఆలస్యంగా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి ట్విట్టర్ ద్వారా కన్ఫమ్ చేశాడు.
సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్' చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమైన రాజ్ కుమార్ హిరాణి ఇప్పుడు 'సంజు' బయోపిక్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడట. బాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా పేరుగాంచిన హిరాణి.. ఈ సినిమాలో.. సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ ను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడట. అందుకు తగ్గట్టే సంజయ్ పాత్రలో ఒదిగిపోతున్నాడట చాక్లెట్ బోయ్ రణ్‌బీర్. ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్‌గా పరేష్ రావల్, తల్లి నర్గీస్గా మనీషా కోయిరాలా నటిస్తుండగా సంజయ్ గాళ్ ఫ్రెండ్స్ అయిన టీనా మునిమ్ పాత్రలో సోనమ్ కపూర్, మాధురి దీక్షిత్ రోల్లో కరిష్మా టన్నా కనిపించబోతున్నారు. ఇక సంజయ్ దత్ భార్య మాన్యత దత్‌గా దియా మీర్జా నటిస్తోంది. 'పి.కె' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో వస్తోన్న సంజయ్ దత్ బయోపిక్.. ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







