'అవర్ కార్టూన్ ప్రెసిడెంట్' ట్రైలర్ విడుదల
- January 07, 2018
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హాలీవుడ్లో 'అవర్ కార్టూన్ అనే సిరీస్ రాబోతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు స్టీఫెన్ కోల్బర్ట్ ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో ట్రంప్ సతీమణి మెలానియా, ఆయన స్నేహితులు, విమర్శకులు, వైట్‌హౌస్ ప్రతినిధులను కార్టూన్ రూపంలో చూపించారు. ట్రంప్ తన గదిలో టీవీ చూస్తూ 'ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్' అని అరవడం నవ్వులు పూయిస్తోంది.
పక్కన కూర్చున్న మెలానియా ట్రంప్‌ని తదేకంగా చూస్తుంటే 'ఎందుకలా చూస్తున్నావ్. ముందు టీవీ ఉంది' అని గదమాయించడం ఫన్నీగా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటి నుంచి మీడియా రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ విషయాలన్నీ ఈ సిరీస్‌లో ఫన్నీగా చూపించారు. పది ఎపిసోడ్లతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 11 ఈ సిరీస్‌ను ప్రసారం చేయనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







