కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' ఫస్ట్ లుక్ విడుదల
- January 08, 2018
నటుడిగా, నిర్మాతగా సక్సెస్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల జై లవకుశ అనే చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాడు. ఇక నటుడిగా ఎంఎల్ఏ అనే చిత్రాన్ని చేశాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలోనే ఈ మూవీ విడుదలకి ప్లాన్ చేశారు నిర్మాతలు. ఇక ప్రస్తుతం 59 ఏళ్ల రైటర్ జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తుండడం విశేషం. అయితే ఈ మూవీకి తాజాగా తాజాగా 'నా నువ్వే' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనేది ట్యాగ్ లైన్ ను గా ఉంచారు. కల్యాణ్ రామ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. తొలిసారిగా తమన్నా..
కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







