అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత ''వైఫై''
- January 08, 2018
భారత్ లోని అన్ని రైల్వే స్టేషన్లలో త్వరలో వైఫై అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8,500 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.700కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం వైఫై స్టేషన్లే ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రైల్వే శాఖ.. ఈ ఏడాది మార్చినాటికి 600 స్టేషన్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 216 ప్రధాన స్టేషన్లలో రైల్వే శాఖ వైఫై సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీనివల్ల 70 లక్షల ప్రయాణీకులు ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకోగలుగుతున్నారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం అత్యవసరమైందని.. అలాంటి సౌకర్యాన్ని మేము దేశంలోగల అన్ని రైల్వే స్టేషన్లలో అందించనున్నాం అని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 1,200 స్టేషన్లలో మాత్రం కేవలం ప్రయాణికులు మాత్రమే వైఫై ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోగల సుమారు 7,300 స్టేషన్లలో మాత్రం అటు ప్రయాణీకులకు, ఇటు స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా వైఫైని అందుబాటులోకి తీసుకురానుండటం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







