విస్తారా వార్షిక సేల్
- January 08, 2018
ఫుల్ సర్వీసు క్యారియర్ విస్తారా తన మూడో వార్షిక సేల్‌ను ప్రారంభించింది. పరిమిత కాల వ్యవధిలో అతి తక్కువగా విమాన టిక్కెట్‌ను రూ.1,099కే ఆఫర్ చేయనున్నట్టు విస్తారా పేర్కొంది. కేవలం 24 గంటలు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. 2018 జనవరి 9న 00:00 గంటల నుంచి 23:59 గంటల వరకు ఈ సేల్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ఈ విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణ కాలం 2018 జనవరి 17 నుంచి 2018 ఏప్రిల్ 18కు ఉండనుంది. విస్తార వెబ్సైట్, యాప్, ఎయిర్‌పోర్టు టిక్కెట్ ఆఫీసులు, విస్తారా కాల్‌సెంటర్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈ 24 గంటల సేల్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. విస్తారా తన మూడో వార్షికోత్సవాన్ని జనవరి 9న జరుపుకుంటోంది.
మూడు క్యాబిన్ క్లాసెస్‌కు ఈ టిక్కెట్లను విస్తారా ఆఫర్ చేస్తోంది. గోవా, బెంగళూరు, కొచ్చి, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చంఢీగర్, అమృత్సర్, లక్నో, రాంచి, శ్రీనగర్, పోర్ట్ బ్లయిర్, చెన్నై వంటి మార్గాలకు ఈ సేల్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. జమ్ము నుంచి శ్రీనగర్‌కు టిక్కెట్ల ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుండగా.. ఢిల్లీ నుంచి చంఢీగర్కు రూ.1,249, ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు రూ.1,249, ఢిల్లీ నుంచి లక్నోకు రూ.1,299, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1,499కు టిక్కెట్ల ధరలు ప్రారంభవుతున్నాయి. ఈ సేలో టిక్కెట్లు పరిమిత సీట్లకే పరిమితమై ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్‌లోనే అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







