ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఆపను: సూర్య

- January 09, 2018 , by Maagulf
ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఆపను: సూర్య

తమిళ్ స్టార్ హీరో సూర్య ఓ సినిమాలో నటిస్తున్నారంటే.. తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ చిత్రం వైపు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. త‌న ప్ర‌తి సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. దీనికి సూర్య తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లే  కార‌ణం. ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఆపనని, అయితే కొత్త కాన్సెప్టులు రావడానికి సమయం పడుతుందని సూర్య తెలిపారు. అలాంటి స్క్రిప్టులు అంత సులువుగా రావన్నారు. ఏదైనా ప్రయోగాత్మక చిత్రం చేసిన తరువాత.. వెంటనే మంచి కమర్షియల్‌ సినిమా చేయడం కరెక్టని ఆయన అభిప్రాయపడ్డారు. 

తెలుగులో తొలిసారి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నేను చదువుకున్న తమిళ్ లిటరేచర్‌లో ‘సుందర తెలుంగు’ అన్నారు. ఇండియాలో మధురమైన భాష తెలుగు అని అర్థం. తమిళ్ డబ్బింగ్‌కు ఎనిమిది రోజులు తీసుకుంటే.. తెలుగు డబ్బింగ్‌ కేవలం ఆరు రోజుల్లో పూర్తి చేశానని సూర్య తెలిపారు. గ్యాంగ్ సినిమా చేస్తున్నప్పుడు తనకు పాత రోజులు గుర్తొచ్చాయని చెప్పారు. నేను, కార్తీ కలిసి సినిమా చేద్దామనుకుంటున్నాం.  నేనో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను అని తమిళ్ స్టార్ హీరో సూర్య అన్నారు. 

సూర్య తాజా తమిళ్‌ చిత్రం ‘తాన‌ సేరంద కూటం’.. ‘గ్యాంగ్’ అనే పేరుతో తెలుగులో అనువాద‌మవుతున్నది. కీర్తిసురేష్ క‌థానాయిక‌గా నటించిన ఈ సినిమాలో కార్తీక్, రమ్యకృష్ణ, ఆర్.జె.బాలాజీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా సూర్య అభిమానుల‌ను అల‌రించేలా ఆస‌క్తిక‌రంగా  ఉంటుందని తెలుస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో యువి క్రియేషన్స్ సంస్థ‌ విడుదల చేస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూర్చిన  ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న తెలుగు, తమిళ్ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com