టాలీవుడ్ ను ఊపేస్తున్న శ్రీయ ఫోటో ఇదే
- January 09, 2018
టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీయ. టాలీవుడ్ లోని అందరు అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వయసు మూడు పదులు దాటినా తరగని అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ మధ్యనే అగ్రకథానాయకుడు బాలకృష్ణ సరసన పైసా వసూల్ చిత్రంలో నటించి నందమూరి అభిమానులను మరోసారి మెప్పించింది. ఇతర రంగాలనుంచి వచ్చిన హీరోయిన్ అయిదారేళ్లు ఇండస్ట్రీలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఆ తరువాత అవకాశాలు రాని కారణంతో తిరిగి వెళ్ళిపోతారు. కానీ శ్రియా అలాకాదు కెరీర్ మొదలు నుంచి నేటి వరకు అదే జోష్ ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు నేటి హీరోయిన్లతో సమానంగా సినిమాలు చేస్తూ సవాల్ విసురుతుంది. రీసెంట్ గా శ్రియా ఫోటో షూట్ నిర్వహించింది. ఆ ఫోటో షూట్ తో టాలీవుడ్ ను మరికొన్ని సంవత్సరాలపాటు తన హవా ఏంటో నిరూపించుకునేలా మై సౌత్ డివా క్యాలెండర్ కు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్స్ మరికొన్ని ఆఫర్స్ ను దక్కించుకునేలా ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ ఫోటో చూసిన వారికెవరికైనా మతి పోవాల్సిందే అంటున్నారు శ్రీయ అభిమానులు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







