మనామా:తషాన్‌ జంక్షన్‌ వద్ద లేన్‌ మూసివేత

- January 09, 2018 , by Maagulf
మనామా:తషాన్‌ జంక్షన్‌ వద్ద లేన్‌ మూసివేత

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌, షేక్‌ సల్మాన్‌ హైవే మరియు తషాన్‌ అవెన్యూ జంక్షన్‌ - అల్‌ ఖమీస్‌ ప్రాంతంలో అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్‌ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఓ లేన్‌ని మూసివేయనున్నారు. ఈ మూసివేత జనవరి 11న రాత్రి 11 గంటల నుంచి ఆదివారం జనవరి 14 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. మూసివేత నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలనీ, అలాగే ట్రాఫిక్‌ సిబ్బంది సూచనల మేరకు నడచుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com