ఇటలీ లో బోటు మునక : 64 మంది మృతి
- January 09, 2018
ఇటలీ:అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించాలకున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. మృతులు అందరూ ఆఫ్రికా ఖండానికి చెందిన లిబియా దేశం నుంచి యూరప్‌లోకి ప్రవేశించేందుకు మధ్యదరా సముద్రంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.
మునిగిపోతున్న పడవను గమనించిన ఇటలీ కోస్ట్ గార్డు 86 మందిని రక్షించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చిన్న బోటులో 150 మందికి పైగా ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
మధ్యదరా సంద్రంలోకి ప్రవేశించిన ఎనిమిది గంటల తర్వాత బోటుకు చిల్లుపడినట్లు వెల్లడించింది. పడవలోని వారందరూ ఓ వైపునకు వెళ్లారని చెప్పింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన బోటు తిరబడిందని పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







