యూఏఈ ట్రాఫిక్ ప్రోగ్రామ్స్: 668 మోటరిస్టులకు ఊరట
- January 09, 2018
యూఏఈ:అబుదాబీ పోలీసులు నిర్వహించిన ట్రాఫిక్ ప్రోగ్రామ్స్ ద్వారా, 668 మంది మోటరిస్టులు ఊరట పొందారు. ఇందులో కొందరు తమ లైసెన్సుల్ని తిరిగి పొందగా, మరికొందరు బ్లాక్ పాయింట్స్‌ని తగ్గించుకోగలిగారు. 87 మందికి బ్లాక్ పాయింట్స్ తగ్గాయని, 681 మంది మోటరిస్టులు తమ లైసెన్సుల్ని తిరిగి పొందారని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్, అలాగే ట్రాఫిక్ కౌన్సిల్ అల్ అయిన్‌లో మూడు నెలలపాటు 133 ప్రోగ్రామ్స్‌ని నిర్వహించారు. పోలీస్ ఫాలో అప్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ ఒబైద్ అల్ ఖైలి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ కల్చర్‌ని పెంపొందించాయనీ, అలాగే పాజిటివ్ రోడ్ హ్యాబిట్స్‌ని వాహనదారుల్లో పెంపొందించాయని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు ఈ ప్రోగ్రామ్స్‌కి హాజరవ్వాల్సి ఉందని లేని పక్షంలో వాహనాల్ని సీజ్ చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పాయింట్స్ రిడక్షన్ సెక్షన్ హెడ్ మేజర్ అహ్మద్ జుమా అల్ ఖైయిలి చెప్పారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







