తొలి ఇండియ‌న్ అంత‌రిక్ష సినిమా'టిక్ టిక్ టిక్‌' టీజ‌ర్ విడుద‌ల‌

- January 10, 2018 , by Maagulf
తొలి ఇండియ‌న్ అంత‌రిక్ష సినిమా'టిక్ టిక్ టిక్‌' టీజ‌ర్ విడుద‌ల‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న చిత్రం 'టిక్ టిక్ టిక్‌'. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రంలో తొలి అంత‌రిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్క‌డం విశేషం. ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ హీరో అడివిశేష్ విడుద‌ల చేశారు. సినిమా త్వ‌ర‌లోనే తెలుగు, త‌మిళంలో గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఈ టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సంద‌ర్బంగా....హీరో అడివిశేష్ మాట్లాడుతూ - "ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీ `టిక్ టిక్ టిక్‌`. నాకు ఇష్ట‌మైన హీరో జ‌యం ర‌విగారు ఈ సినిమాలో హీరోగా న‌టించారు. ల‌క్ష్మ‌ణ్ తెలుగులో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. టీజ‌ర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ 'గ్రావిటీ'ని త‌ల‌పిస్తుంది. ఇండియ‌న్ స్క్రీన్‌ఫై ఇలాంటి సినిమా రావ‌డం చాలా గొప్ప విష‌యం. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలుస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌" అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com