భార్యల్ని సంతృప్తి పరచేందుకు డ్రగ్స్‌ వినియోగం

- January 11, 2018 , by Maagulf
భార్యల్ని సంతృప్తి పరచేందుకు డ్రగ్స్‌ వినియోగం

న ముగ్గురు భార్యల్ని సంతృప్తి పరిచేందుకోసం తాను డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించడం సంచలనంగా ఉంది. జిసిసి జాతీయుడు, షార్జా మిస్‌డెమీనర్‌ కోర్టులో విచారణకు హాజరయ్యాడు. నిందితుడిపై మెఠాంఫెటమైన్‌ క్రిస్టల్‌ లేదా క్రిస్టల్‌ మెథ్‌ (యూఏఈలో షెబుగా వ్యవహరిస్తారు) వినియోగిస్తున్నట్లు కేసు నమోదయ్యింది. విచారణ సందర్భంగా, న్యాయస్థానాన్ని కన్విన్స్‌ చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. తాను అమాయకుడిననీ, తన ముగ్గురి భార్యలను సంతృప్తి పరచేందుకే డ్రగ్స్‌ తీసుకున్నానని పేర్కొన్నాడు. తన స్నేహితుడు ఇచ్చిన ఓ మందు కారణంగా తాను హైపర్‌ యాక్టివ్‌గా మారేవాడిననీ, అలా తనకు ఆ మందు అలవాటయ్యిందని చెప్పాడు. ఆ మందు యూఏఈలో నిషేధించబడిందని తనకు తెలియదని అంతకు ముందు న్యాయస్థానం యెదుట మొరపెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మాట మార్చాడు. నిషేధిత మందు అని తెలిసీ, తన భార్యల కోసం అలా చేయాల్సి వచ్చిందనీ, తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తనను క్షమించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com