అభాగ్యుడికి ఆపన్నహస్తం అందించిన అజ్మన్‌ పోలీస్‌

- January 11, 2018 , by Maagulf
అభాగ్యుడికి ఆపన్నహస్తం అందించిన అజ్మన్‌ పోలీస్‌

యూఏఈలో పోలీసులు, జాబ్‌ లేక ఇబ్బంది పడుతున్న అభాగ్యుడికి ఆపన్నహస్తం అందించారు. అరబ్‌ వ్యక్తి, మాట్లాడేందుకు సైతం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో యూఏఈలో ఉద్యోగం కోసం టూరిస్ట్‌ వీసాపై వచ్చాడు. అయితే ఉద్యోగం దొరక్కపోవడంతో యూఏఈలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తిరిగి స్వదేశానికి వెళ్ళలేని క్రమంలో అతని మూడు నెలల వీసా కూడా గడువు తీరిపోయింది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్న బాధితుడ్ని అజ్మాన్ పోలీసులు ఆదుకున్నారు. అజ్మాన్ పోలీస్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ రంగంలోకి దిగి, అతనికి స్వదేశానికి టిక్కెట్‌ కొనిచ్చి, అదనంగా కొంత సొమ్మునీ అతనికి అందించారు. మానవతా దృక్పథంతో ఈ సాయం చేసినట్లు అజ్మాన్ పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com