ఛార్జీలను పెంచిన కరీమ్, ఊబర్
- January 11, 2018
రైడ్ హెయిలింగ్ క్యాబ్ సర్వీసులు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. వ్యాట్ అమలు నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకోనున్నట్లు ఊబర్, కరీమ్ సంస్థలు వెల్లడించాయి. యూఏఈలో ఈ రెండూ తమ యాప్స్ ద్వారా వినియోగదారుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ని 5 శాతం వ్యాట్ నుంచి మినహాయించినప్పటికీ, మార్కెట్ ప్లేస్ సర్వీసెస్‌కి సంబంధించి 1.7 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తోందనీ, అది క్యాబ్ ఛార్జీలపై పడిందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఊబర్ ఎక్స్, ఊబర్ సెలక్ట్, ఊబర్ బ్లాక్, ఊబర్ ఎక్స్‌ఎల్,ఊబర్ వన్ మరియు ఊబర్ విఐపిలకు ఈ టాక్స్ వర్తిస్తుంది. గతంలో 100 దిర్హామ్‌ల ఖర్చయ్యే దూరానికి ఇకపై 101.7 దిర్హామ్‌ల ఖర్చు కానుంది. కరీమ్ సంస్థ, దాదాపుగా ఛార్జీలు 1 శాతం వరకు పెరుగుతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







