ఉమ్మ్ సలాల్ లో శ్రామిక ఆసుపత్రికి ప్రవాస కార్మికుల విజ్ఞప్తులు
- November 21, 2015
దోహాకు ఉత్తరంగా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మ్ సలాల్ మొహమ్మద్ పట్టణంలో నివసిస్తున్న ప్రవాస కార్మికులు, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణమైన ఆరోగ్య సదుపాయాలు పెరగడం లేదని, తమకు ఒక కొత్త ఆసుపత్రి అత్యవసరమని అనేక మార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలలో సుమారు 30 మంది కాంట్రాక్టు సంస్థలు ఈ పట్టణంలో మరియు పరిసర ప్రాంతాలలో శ్రామిక ఆవాసాలను ఏర్పాటు చేసాయని, అందులో సుమారు 20,000 మంది నివాస ముంటున్నారని సమాచారం. ఐతే వీరికి సరయిన వైద్య సదుపాయం అందుబాటులో లేదు; వైద్య సేవలకోసం వారు, అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతానికి లేదా మెసాయిమీర్ కు వెళ్ళవలసి వస్తోంది. అందువల్ల తమ అభ్యర్ధనలను మన్నించి, ఆరోగ్య శాఖ వారు ఇక్కడ ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, అంతవరకూ తాత్కాలిక ఏర్పాటుగా మొబైల్ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులో ఉంచాలని ఇక్కడి అనేక మంది శ్రామికులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









