సౌదీ అరేబియాలో మహిళలకు మాత్రమే మొట్టమొదటి కారు షోరూమ్
- January 12, 2018జెడ్డా: కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ఒక కారు షోరూమ్ ను ఒక సౌదీ ప్రైవేట్ కంపెనీ గురువారం ప్రారంభించారు. ఐదు నెలల క్రితం మహిళలు కారు డ్రైవింగ్ చేయవచ్చని ప్రభుత్వం ఒక నిర్ణయం చేయడంతో కేవలం మహిళల కోసం మొదటి కారు ప్రదర్శనశాల ప్రారంభమైంది.ఈ షోరూంను జెడ్డాలోని పశ్చిమ రెడ్ సీ పోర్ట్ సిటీ షాపింగ్ మాల్ లో మొదలయింది. మహిళలు వారికి ఇష్టమైన సొంత కార్లను ఎంచుకోవడానికి స్వేచ్ఛను ఈ కారు షోరూమ్ లో అనుమతించారు.గత ఏడాది చివరలో చారిత్రాత్మక నిర్ణయం కారణంగా సౌదీ మహిళలకు తిరిగి డ్రైవింగ్ చేసే అవకాశం సౌదీ రాజు కల్పించారు. మతపరమైన కారణాల ఆధారంగా దాదాపు మూడు దశాబ్దాల పాటు మహిళలు డ్రైవింగ్ నిషేధం కొనసాగింది. ఆరు నెలల క్రితం దీనిని రద్దు చేసి మరల డ్రైవింగ్ చేసే అవకాశం సౌదీ స్త్రీలకి వచ్చింది. షోరూమ్ లో వివిధ రకాల కార్ల తయారీదారుల నుండి పలు కార్లను విస్తృత ఎంపిక చేసుకొనే సదుపాయం స్త్రీలకు అందిస్తోంది మరియు ఇక్కడ ఉద్యోగులుగా మహిళలు మాత్రమే పనిచేస్తారు.ఇది ప్రముఖ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల ద్వారా అందించిన కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక పరిష్కారాలతో మహిళలకు అందిస్తుంది. చమురు సంపన్న రాజ్యంలో మహిళలకు మరిన్ని ఆటోమొబైల్స్ దుకాణాలను తెరవాలని కారు షోరూమ్ సంస్థ యోచిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు