'విశ్వనట సార్వభౌమ' డా. మోహన్ బాబు
- January 13, 2018
కళాబంధు టీ. సుబ్బిరామిరెడ్డి మళ్ళీ కళాపోషణ మీద దృష్టి పెట్టారు. సినిమా కళాకారులపై ప్రత్యేక ఆసక్తి చూపించే టీఎస్సార్ మరో అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. నవరస నటుడు డాక్టర్ మోహన్ బాబు సినీరంగంలో అరంగేట్రం చేసి 42 ఏళ్ళు గడిచిన సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నది టీఎస్సార్ ఉద్దేశం. ఇందుకోసం హైదరాబాద్ శిల్పకళావేదికలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న జరిగే ఈ వేడుకకు 'టీఎస్సార్ కాకతీయ కల్చరల్ ఫెస్టివల్' అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబుకి 'విశ్వ నట సార్వభౌమ' పేరుతో బిరుదునివ్వాలన్నది కూడా టీఎస్సార్ సంకల్పం. టాలీవుడ్ నటీనటుల్లో అనేకమంది పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి టీఎస్సార్ నేతృత్వంలో ప్రెస్ మీట్ జరిగింది. నటుడు మోహన్ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. మరికొందరు ఇందులో పాల్గొని.. కార్యక్రమ రూపురేఖల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







