సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'సైజ్ జీరో' సినిమా..!!

- November 21, 2015 , by Maagulf
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'సైజ్ జీరో' సినిమా..!!

ఆర్య, అనుష్కలు ప్రధాన పాత్రల్లో పీవీపీ బ్యానర్‌పై తెరకిక్కిన 'సైజ్ జీరో' చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు అధికారులు దీనికి 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల హిట్ తరువాత లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వస్తున్న మరో సినిమా 'సైజ్ జీరో'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం హీరోయిన్ అనుష్క ఏకంగా 20 కిలోల బరువు పెరగడంతోపాటు ముద్దుగా, బొద్దుగా బబ్లీ క్యారెక్టర్‌లో తెరపై కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. వంపు సొంపులతో నాజూగ్గా కనిపించే అనుష్క ఉబకాయం నేపథ్యంలో సాగే విభిన్నమైన పాత్రను చేయడంతో ప్రతి ఒక్కరిలోనూ చిత్రం పట్ల ఆసక్తి నెలకొంది. 'ఇంజి ఇడుపళగి' అనే పేరుతో తమిళ్‌లో, 'సైజ్ జీరో' పేరిట తెలుగులో ఈ సినిమాను ఒకేసారి ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నారు. నటీ నటులు: అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవి శేష్, పోసాని కృష్ణ మురళి, భరత్, బ్రహ్మానందం సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా మాటలు: కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే: కణిక

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com