'గో ఎయిర్' వారి సంక్రాంతి కానుక
- January 13, 2018
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఎయిర్ డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అన్ని చార్జీలు కలుపుకొని రూ.1157లకే టికెట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లై స్మార్ట్, సేవ్ మోర్ స్కీం కింద ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పండగసీజన్, న్యూ ఇయర్, లాంగ్ వీకెండ్ సందర్భంగా తమ కస్టమర్లకు గొప్ప అనుభవాన్ని అందించాలని భావిస్తున్నామని గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ పాటు గోఎయిర్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 10శాతం అదనపు తగ్గింపుకూడా లభ్యం. ఇలా వన్ వేలో రూ.250 తగ్గింపును, రిటర్న్ టికెట్ బుకింగ్‌పై 500 ఆఫర్ చేస్తోంది. జనవరి 22 తో ఈ ఆఫర్ బుకింగ్స్ ముగుస్తాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 1, ఫిబ్రవరి నుంచి 15,ఏప్రిల్‌దాకా ప్రయాణించవచ్చు.
గోఎయిర్ వెబ్ సైట్ ప్రకారం హైదరాబాద్-లక్నో రూ. 3002, హైదరాబాద్ -అహ్మదాబాద్ రూ. 3362, లక్నో-హైదరాబాద్ టికెట్ ధర రూ. 3574 గాను నిర్ణయించింది. అలాగే లక్నో-ఢిల్లీ టికెట్ రూ .1,455, ఢిల్లీ-లక్నో రూ .1,588, బెంగళూరు-కొచ్చి రూ .1703, పుణె-బెంగళూరుకు రూ .2,196, గౌహతి-కోల్‌కతా రూ. 2,244, పుణె-అహ్మదాబాద్ రూ .2405 , ఢిల్లీ-పాట్నా రూ .3,104 ధరల్లో టికెట్లను అందిస్తోంది. వీటితో పాటు ఇతర మార్గాల్లో అందిస్తున్న తగ్గింపు ధరల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చింది.
సాధారణ కాన్సిలేషన్, రీ బుకింగ్ ఈ చార్జీలు వర్తిస్తాయి. గ్రూప్ బుకింగ్‌లకు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







