కాలిఫోర్నియాలో 18 మంది మృతి

- January 13, 2018 , by Maagulf
కాలిఫోర్నియాలో 18 మంది మృతి

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో వరదలకు బురదతో కూడిన కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. లాస్‌ఏంజెల్స్‌కు చెందిన వెంచురా, శాంటాబార్బారాలు థామస్‌ అగ్నికి నెలరోజుల నుండి ఆహుతవుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో అడవి దగ్ధమైంది. ఈ నేపథ్యంలో లాస్‌ పడెర్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లోని కొన్ని ప్రాంతాలు అధికారులు మూసివేశారు. డిసెంబరు 4న అగ్ని రాజుకుందని, తీవ్రమైన గాలులు, ఎండిన చెట్లు, ఆకులు మంటలను ఇంకా ఎక్కువ చేస్తున్నాయని అన్నారు. లాస్‌ఏంజెల్స్‌లోని 440 చదరపు మైళ్ల వరకు అగ్ని చుట్టుముట్టిందన్నారు. దీంతో వెయ్యి భవనాలు, ఇళ్లు, వేలకుపైగా ప్రజలు పారిపోవలసి వచ్చిందన్నారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం ఇంటి నిర్మాణం కోసం బుల్డోజర్‌తో కట్‌ చేస్తుండటంతో మంటలు రేగాయని దీంతో అవి సమీప ప్రాంతానికి చుట్టుముట్టాయని అన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిలో నలుగురు పారిపోయారని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com