కతార్ పడవ సంబరాలలో భద్రతను గురించి ప్రచారం చేసిన కుల్లునా

- November 21, 2015 , by Maagulf
కతార్ పడవ సంబరాలలో భద్రతను గురించి ప్రచారం చేసిన కుల్లునా

కతార్ దేశంలో హమద్ మెడికల్ కార్పోరేషన్ వారి హమద్ అంతర్జాతీయ శిక్షణా కేంద్రం (HITC )వారు, కోనోకో ఫిలిప్స్ కతార్ వారు వ్యవస్థాపక పోషకులుగా స్థాపించిన జాతీయ ఆరోగ్య, భద్రత మరియు అవగాహనా ప్రచార కార్యక్రమం - కుల్లునా, లుసైల్ పట్టణంలో మౌర్జాన్ మరినాస్ లో జరిగిన కతార్ ఇంటర్నేషనల్ బోట్ షో -2015 లో విచ్చేసిన వేలాదిమంది సందర్శకులకు, వరుసగా మూడవ సంవత్సరం కూడా ఇళ్ళు, జలాశయాలు మరియు బోట్ లలో భద్రతను గురించి ప్రచారాన్ని నిర్వహించారు. మనందరం పెద్దగా పట్టించుకోని నీరు అనే అంశం కూడా, దురదృష్టవశాత్తు   ఒకోసారి పిల్లల పాలిట ప్రమాదకరం కావచ్చు. రెండు నిముషాల వ్యవధిలో, ఐదు క్యూబిక్   సెంటిమీటర్ల నీటిలో చిన్నారులు మునిగిపోవచ్చు; ఐతే నీటి వలన సంభవించే ప్రమాదాలను ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా నివారించవచ్చు అని HITC డైరక్టర్ డా.అబ్దుల్ నూర్ సైఫెలదీన్ ఈ సందర్భంగా  వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com