'తెలుగు తరంగిణి-రస్ అల్ ఖైమా' వారి 'సంక్రాంతి' సంబరాలు
- January 13, 2018




తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలో సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రీమతి ప్రశాంతి, హేమ ప్రార్ధనలతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం భోగి మంటల అనంతరం, సంప్రదాయం దుబాయి వారి సహకారం తో శ్రీ మైనంపాటి ధర్మరాజు నిర్వహించిన శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగింది. కళ్యాణ మహోత్సవంలో శ్రీమతి శ్రీలలిత, శ్రీమతి ఇందిరా అన్నమయ్య కీర్తనలు, శ్రీమతి వాణిశ్రీ, కుమారి శ్రావణి ల కూచిపూడి నృత్యాలు, సామూహిక విష్ణు సహస్ర నామార్చన, తిరుప్పావై, సాతుమరై అందరినీ మంత్రముగ్ధులను చేసాయి.
చిరంజీవులు మానస్, ధరన్, విశ్వ ల హరిదాసుల సందడి, రంగవల్లుల పోటి, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువు, శ్రీ మహేష్ ప్రభు సౌజన్యంతో భగవద్గీత శ్లోకాల పఠనం, కుమారి ఐశ్వర్య బృదం చేసిన గోదాకళ్యాణ నృత్య రూపకం, మ్యూజిక్ ఇండియా దుబాయ్ రాకేశ్, ప్రశాంతి సంగీత విభావరి, చిన్నారులు షాలిని, నిహారిక, అంజన సంధ్య, సుమయ్య, భార్గవి ల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. కమ్మని విందు భోజనాలతో, ఆట పాటలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో పల్లెలలోని సంక్రాంతిని సుదూరతీరాలలో ఉన్న రస్ అల్ ఖైమా నగరం లోని సుమారు 1000 మంది తెలుగు వారు తరంగిణి వారి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో దుబాయ్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఇ. తులసి ప్రసాద్ ఇంకా APNRT కోఅర్దినేటర్స్ పాల్గొన్నారు. తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్ అద్యక్షతన తరంగిణి సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు సుజన్ , మైథిలి ఏంకర్లుగా వ్యవహరించారు.
బిట్స్ రస్ అల్ఖైమా ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాగల్ఫ్ మీడియా సహకారం అందించింది.











తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







