'ఎంఎల్ఏ' నందమూరి కళ్యాణ్‌రామ్
- January 14, 2018
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ మూవీ 'ఎంఎల్ఏ'. 'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్' అనేది కాప్షన్. ఈ చిత్రంలో అందాల భామ కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు. టిజి. విశ్వప్రసాద్ సమర్పణలో, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా భోగి పండుగను పురస్కరించుకొని ఈ చిత్ర టీజర్ బయటకు వదిలింది చిత్రయూనిట్. టీజర్ ప్రారంభంలోనే 'వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు మన అందరి ఆశాజ్యోతి ఆంధ్రజ్యోతి.. ఈనాడు.. సాక్షి.. నమస్తే తెలంగాణా' అనే డైలాగ్ వస్తుండగా నందమూరి కళ్యాణ్ రామ్ నమస్కారం చేస్తూ దర్శనమిస్తున్నాడు.
టీజర్ చూస్తుంటే ఓ డిఫెరెంట్ లుక్ లో కళ్యాణ్ రామ్ బాగా ఆకట్టుకుంటాడని తెలుస్తోంది. టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెల ఫారిన్ షెడ్యూల్లో పాటల చిత్రీకరణతో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంటుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







