ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌కి మోడీ ఆత్మీయ స్వాగతం
- January 14, 2018
భారత్ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బెంజమిన్ నెతన్యాహుకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లడం విశేషం. భారత్ కు చేరుకున్న నెతన్యాహును ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ తీన్ మూర్తి చౌక్‌కు వెళ్తారు. అక్కడ జరుగనున్న కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. ఈ సందర్భంగా తీన్ మూర్తి చౌక్ పేరును తీన్ మూర్తి హైఫీ చౌక్‌గా మార్చనున్నారు. నెతన్యాహు పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ రాత్రి ఆయనకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. నెతన్యాహు వెంట ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11ఏళ్ల బాలుడు మోషే కూడా భారత్ వచ్చాడు. బెంజమిన్ భారత్ లో 6 రోజులపాటు పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







