సూర్య‌, కార్తీ కాంబో మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

- January 16, 2018 , by Maagulf
సూర్య‌, కార్తీ కాంబో మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌ తన తమ్ముడు కార్తీ ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మించనున్నాడని చిత్ర నిర్మాణ సంస్థ ఇప్ప‌టికే అఫీషియల్ ప్రకటన చేసిన సంగ‌తి తెలిసిందే. సూర్య ఓన్ బేనర్ 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై కార్తీ సినిమా రూపొందిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేక‌ర్ పాండిరాజ్ తెర‌కెక్కిస్తున్నారు. పాండిరాజ్ గ‌తంలో సూర్యతో ప‌సంగ 2 అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. తెలుగులో మేము అనే టైటిల్ తో ప‌సంగ 2 విడుదలైంది. అయితే సూర్య బేన‌ర్‌లో కార్తీ చేయ‌బోవు మూవీ తెలుగు, త‌మిళంలో విడుద‌ల కానుండ‌గా త‌మిళంలో ఈ మూవీకి క‌డైకుట్టి సింగ‌మ్‌, తెలుగులో చినబాబు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కార్తీ గెట‌ప్ అదిరిపోయింద‌నే చెప్పవ‌చ్చు. స‌యేషా సైగ‌ల్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com