'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'లో నటించనున్న మంచులక్ష్మి

- January 16, 2018 , by Maagulf
'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'లో నటించనున్న మంచులక్ష్మి

విభిన్న కథలు, పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచులక్ష్మి. ఆమె నటిస్తున్న కొత్త సినిమా 'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'. 'బాహుబలి' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన విజయ్‌ యలకంటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. దీన్ని మంచులక్ష్మి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తన కొత్త సినిమాకు 'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది వేసవిలో రామ్‌ భార్య కథను తెలుసుకోవడానికి సిధ్ధంగా ఉండమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పీపుల్స్‌ మీడియా, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రఘు దీక్షిత్‌ సంగీతం అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com