21 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.!
- January 16, 2018
అమెజాన్ ఇండియా తన గ్రేట్ ఇండియన్ సేల్ డేట్లు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సేల్ ఉంటుంది. ఎప్పటిలాగే ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటలు ముందుగానే అంటే జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ కేటగిరీల్లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు అమెజాన్ పే యూజర్స్ రూ.250 అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుకు పది శాతం బ్యాలెన్స్ బ్యాక్ (రూ.200 వరకు) ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. మొబైల్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్లు లేటెస్ట్ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. 60కిపైగా అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ మోడల్స్ కూడా డిస్కౌంటు రేట్లకు అందుబాటులో ఉంటాయి. ఆపిల్, ఆసుస్, బ్లాక్‌బెర్రీ, కూల్‌ప్యాడ్, ఇన్‌ఫోకస్, లెనోవో, ఎల్‌జీ, మోటో, వన్‌ప్లస్, సామ్‌సంగ్, వివో, షియోమీలాంటి టాప్ బ్రాండ్ మొబైల్స్‌పై ఆఫర్లు ఉన్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు ఇక టీవీలపై 40 శాతం, టాబ్లెట్లపై 40 శాతం, స్టోరేజ్ డివైస్‌లపై 50 శాతం, నెట్‌వర్కింగ్ డివైస్‌లపై 60 శాతం, కెమెరాలపై 25 శాతం, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌పై 60 శాతం, పీసీ, సంబంధిత యాక్సెసరీస్‌పై 40 శాతం, ప్రింటర్లపై 35 శాతం డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. కొత్త ల్యాప్‌టాప్‌లపై రూ. 20 వేల వరకు డిస్కౌంట్లు ఇవ్వనుంది అమెజాన్. ఇక ఎక్స్‌చేంజ్, నో కాస్ట్ ఈఎంఐలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







