నటుడు, ఎంపి సురేష్ గోపి అరెస్టు

- January 16, 2018 , by Maagulf
నటుడు, ఎంపి సురేష్ గోపి అరెస్టు

బిజెపి రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు సురేష్ గోపీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పన్ను ఎగవేశారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసినట్లు క్రైమ్ పోలీసులు చెప్పారు. పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లు తప్పుు ధ్రువపత్రాలతో రెండు లగ్జరీ కార్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 30 లక్షల మేర పన్ను ఎగ్గొట్టినట్లు అధికారులు అంటున్నారు.

దానిపై తిరువనంతపురం కోర్టు ఆయనకు బెయిల్‌తో కూడిన అరెస్టు వారంట్ జారీ చేసింది. అరెస్టుకు మూడు వారాల గడువు స్తూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. సోమవారంనాడు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. లక్ష రూపాయల బాండుతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో సురేష్ గోపీకి బెయిల్ మంజురైంది. గత సార్వత్రిక ఎ్నికల్లో కేరళలో బిజెపి తరపున ఆయన ప్రచారం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com