ఐఐఎంలో కేస్‌ స్టడీగా 'బాహుబలి 2'!

- January 16, 2018 , by Maagulf
ఐఐఎంలో కేస్‌ స్టడీగా 'బాహుబలి 2'!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం 'బాహుబలి', 'బాహుబలి 2'. 'బాహుబలి'కి సీక్వెల్‌గా వచ్చిన 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' ఇప్పుడు కేస్‌ స్టడీ కాబోతోంది. అహ్మదాబాద్‌కి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సీఎఫ్‌ఐ (కాంటెంపరరీ ఫిలిం ఇండస్ట్రీ) విద్యార్థులకు 'బాహుబలి 2' సినిమాను సిలబస్‌లో చేర్చనున్నారు.

ఈ విషయాన్ని ఐఐఎం ప్రొఫెసర్‌ భరతన్‌ కందస్వామి మీడియా ద్వారా వెల్లడించారు. '2018 విద్యా సంవత్సరంలో బాహుబలి 2 సినిమాను సీఎఫ్‌ఐ విద్యార్థుల సిలబస్‌లో చేర్చనున్నాం. ఈ సినిమా ద్వారా సీక్వెల్స్‌ని మార్కెటింగ్‌ కాన్సెప్ట్‌గా వివరించేలా చేస్తాం. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో సీక్వెల్‌ కంటే ప్రీక్వెలే బెటర్‌ అని తేలింది. కానీ ప్రీక్వెల్‌ కంటే సీక్వెల్‌ ద్వారానే సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తాయి. సినిమాల విషయంలో ఎలాంటి ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవాలి? సీక్వెల్స్‌ నుంచి తెలుసుకోవాల్సిన మార్కెటింగ్‌ మంత్రాలేంటి? అన్న విషయాలు ఈ ఏడాది విద్యార్థులు తెలుసుకోబోతున్నారు' అని తెలిపారు. సినిమా రంగానికి సంబంధించి వివిధ కోర్సులను ప్రవేశపెట్టిన తొలి ఆసియా బిజినెస్‌ స్కూల్‌ ఐఐఎం. సినిమా రంగానికి సంబంధించిన అన్ని కోర్సులు ఈ బిజినెస్‌ స్కూల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com