రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన `సూపర్ స్కెచ్`
- January 17, 2018
``మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే థ్రిల్లర్‌గా మా `సూపర్ స్కెచ్`ను రూపొందించాం. పూర్తిగా స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది`` అని దర్శకుడు రవి చావలి అన్నారు. `సామాన్యుడు`, `శ్రీమన్నారాయణ` తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో శ్రీ శుక్ర క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రం `సూపర్ స్కెచ్`. ఎరోస్ సినిమాస్ సమర్పణలో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో తెరకెక్కుతోంది. బలరామ్ మక్కల నిర్మాత. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (ఇంగ్లాండ్), గ్యారిటోన్ టోనీ (ఇంగ్లాండ్), బంగార్రాజు, బాబా కీలక పాత్రధారులు.
దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ `` ఒక పోలీసాఫీసర్, ఒక ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య జరిగే కథ ఇది. పోలీసును ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రలు ప్రధానంగా తెరకెక్కించాం. పోలీస్ ఆఫీసర్ నాయక్‌గా నర్సింగ్ నటించారు. ఆయన కేరక్టర్, డైలాగులు సినిమాకు మెయిన్ హైలైట్. శ్రీహరికి ఆల్టర్నేటివ్ ఇతనే... అన్నట్టు చేశాడు. ఇంద్రసేన చేసిన నెగటివ్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అవుతుంది. ప్రతి సెకనూ ఏమవుతుందోనని ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎవరూ ప్రెడిక్ట్ చేయని విధంగా సాగే చిత్రమిది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్ పారెస్ట్ లో షూటింగ్ చేశాం. 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి ఆఖరున గానీ, మార్చిలోగానీ సినిమాను విడుదల చేస్తాం `` అని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడు: రవి చావలి, సమర్పణ: ఎరోస్ సినిమాస్, నిర్మాత: బలరామ్ మక్కల, సహ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, కెమెరామేన్: సురేంద్ర రెడ్డి, ఎడిటింగ్: జునైద్, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, లిరిక్స్: సుభాష్ నారాయణ్, ఇంజపూరి.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!