షేక్ జాయెద్ మెమోరియల్ జనవరి 22న ప్రారంభం
- January 18, 2018
యు.ఏ.ఈ:లేట్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం నిర్మిస్తోన్న మెమోరియల్ జనవరి 22న అబుదాబీలో అధికారిక కార్యక్రమం ద్వారా ప్రారంభం కానుంది. అధికారిక ప్రారంభోత్సవం అన్ని ప్రముఖ జాతీయ టీవీ ఛానల్స్‌లోనూ ఉదయం 9.3 నిమిషాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఇయర్ ఆప్ జాయెద్ - షేక్ జాయెద్ 100వ జయంతి నేపథ్యంలో ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. 2018 స్ప్రింగ్ నుంచి పబ్లిక్ ఈ మెమోరియల్‌ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రముఖ నాయకుడైన షేక్ జాయెద్‌కి సంబంధించి ముఖ్యమైన విషయాలు, మాటలు, ల్యాండ్‌స్కేపింగ్ సహా ఎన్నో ఆకర్షణలు ఈ మెమోరియల్‌లో పొందుపరిచారు. అబుదాబీలోని ఫస్ట్, సెకెండ్ ఇంటర్‌సెక్షన్ వద్ద 3.3 హెక్టార్లలో ఈ మెమోరియల్‌ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







