ఈ బ్యూటీ క్రీమ్‌ ప్రమాదకరం: దుబాయ్‌ మునిసిపాలిటీ

- January 18, 2018 , by Maagulf
ఈ బ్యూటీ క్రీమ్‌ ప్రమాదకరం: దుబాయ్‌ మునిసిపాలిటీ

దుబాయ్‌ మునిసిపాలిటీ, ఫైజా బ్యూటీ క్రీమ్‌ అత్యంత ప్రమాదకరమైనదని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో పౌరులెవరూ ఈ క్రీమ్‌ వాడవద్దని హెచ్చరించింది. ఈ క్రీమ్‌ కోసం ఉపయోగించిన పదార్థాలు, మనుషులకు హానికరమని దుబాయ్‌ మునిసిపాలిటీ పేర్కొంది. ఈ ప్రోడక్ట్‌కి సంబంధించి ఎలాంటి డేటాబేస్‌ రిజిస్టర్‌ కాలేదని మునిసిపాలిటీ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా దుబాయ్‌ మునిసిపాలిటీ - హెల్త్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ ఈవివరాల్ని వెల్లడించింది. క్రీమ్‌లో ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్స్‌లో ఉండే హైడ్రోక్వినోన్‌ కనుగొనబడిందనీ, మెర్క్యురీ కూడా ఉపయోగించారనీ, ఇది విషపూరితమని అందులో ప్రస్తావించారు. ఈ ప్రోడక్ట్‌కి సంబంధించి విక్రయ సమాచారం తెలిస్తే వెంటనే మునిసిపాలిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com