ఫేక్ నెంబర్ ప్లేట్: మోటరిస్ట్‌ని ఛేజ్ చేసిన అబుదాబీ పోలీస్
- January 18, 2018
ఫేక్ నెంబర్ ప్లేట్‌ని వినియోగిస్తున్న మోటరిస్ట్‌ని అబుదాబీ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడ్ని 24 ఏళ్ళ జిసిసి జాతీయుడిగా గుర్తించారు. ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఈ నిందితుడు, ప్రమాదానంతరం అక్కడినుంచి పారిపోయాడు. విచారణలో పోలీసులు, నిందుతుడు ఫేక్ నెంబర్ ప్లేట్‌ని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి పోలీసులు నిందితుడ్ని అప్పగించారు. అబుదాబీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ దాహి అల్ హుమైరి మాట్లాడుతూ, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు చాకచక్యంగా నిందితుడ్ని గుర్తించి, అతన్ని ఛేజ్ చేసి పట్టుకున్నామని చెప్పారు. అతను ఉపయోగించిన కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్ వినియోగానికిగాను నిందితుడిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఇలాంటి నేరాలకు 20,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







